పవన్ కళ్యాణ్ తో కలసి నటించే ఛాన్స్…రకుల్

పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కనున్న విషయం అందరికి  తెలిసిందే. ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ లు హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన రకుల్ కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.