గసగసాలతో గుండె జబ్బులకు చెక్‌

గసగసాలను భారతదేశం అంతటా విరివిగా ఉపయోగించేవే అయినప్పటికీ వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు. ఇవి విచిత్రమైన రుచిని కలిగి ఉండటంతో పాటు వంటకాలకు మంచి సుగంధాన్ని జోడిస్తాయి. తూర్పు మధ్యధరాకు చెందిన గసగసాలు ప్రధానంగా తెలుపు మరియు పసుపు రంగులలో ఉంటాయి. ఈ పువ్వుల విత్తనాలు వేర్వేరు ఆకారాలు, పరిమాణాలు, రంగులలో వస్తాయి. గసగసాలు, వాటి నూనె చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని తినడం వల్ల తలనొప్పి నయం కావడం నుండి ఉబ్బసం వరకు చాలా సమస్యలను తగ్గించే శక్తి గసగసాలలో ఉంది. ఈ విత్తనాలలో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గసగసాలలో ఉండే మాంగనీస్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

గసగసాల వల్ల కలిగే మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు:

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

గసగసాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, బలపరుస్తుంది. అంతేకాదు.. మలబద్ధకం చికిత్సలో కూడా ఇవి బాగా సహాయపడతాయి.

2. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి:

గసగసాలలో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3. నిద్రలేమితో పోరాడుతుంది:

నల్లమందుకు మూలం అయిన గసగసాలను తీసుకోవడం నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి నిద్రలేమికి చికిత్స చేస్తుంది.

4. కళ్ళకు మంచిది:

గసగసాల్లో డే జింక్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాక్యులర్ డీజెనరేషన్ వంటి కంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి.

5. థైరాయిడ్‌తో పోరాడుతుంది:

గసగసాల్లోని జింక్ థైరాయిడ్‌ను నయం చేయడంలో చాలా సహాయపడుతుంది. వీటిలోని జింక్ థైరాయిడ్ గ్రంధులకు ఒక వరంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది.