శ్రీ చింతకుంటప్ప స్వామి నూతన దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం, ఉప్పలపాడు గ్రామంలో శ్రీ చింతకుంటప్ప స్వామి నూతన దేవాలయ ప్రారంభం మరియు జల్దీ పూజ మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు టిడిపి నాయకుడు అశ్వర్త్ రెడ్డి, మరియు జనసేన పార్టీ ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి.నాగ సుధాకర్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, గొట్లురు జీవి, నంద, చిలకం సుధాకర్ రెడ్డి, రేగాటిపల్లి గుర్రప్ప, మల్లేష్, కాటమయ్య, కొండన్న ముదిగుబ్బ అనిల్, మధు, నరేంద్ర, హరి మరియు తదితరులు పాల్గొన్నారు.