మనవరాళ్ల కోరిక మేరకు కేఎఫ్‌సి చికెన్ తయారు చేసిన చిరు

చిరంజీవి లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏ చిన్న ప్రత్యేక సందర్భం వచ్చినా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఈ మధ్యనే దోశలు వేసి తన పాక పోషణను చాటిన చిరంజీవి తాజాగా ఆదివారం సెలవు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి కేఎఫ్‌సి చికెన్ తయారుచేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనవరాళ్లు నివ్రితి సంహితలతో కలిసి కెఎఫ్సి చికెన్ తయారు చేసిన వీడియోని పోస్ట్ చేశారు. ‘రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా..’ అంటూ చిరు ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

చిరంజీవి కూతుర్ల పిల్లలైన సంహిత, నివ్రితితో బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని చిరు అడగగా అందులో ఒకరు కేఎఫ్‌సి చికెన్  కావాలి అని బదులివ్వడం మనం వీడియోలో చూడొచ్చు. ఐతే కరోనావైరస్  టైంలో బయటినుండి తెచ్చుకోవడం మంచిదికాదు అని మీరు హెల్ప్ చేస్తే ఇంట్లోనే చేసుకుందాం అని అంటారు చిరు. అందుకు వాళ్లు సరే అనగా మనుమరాళ్లను అసిస్టెంట్స్‌గా పెట్టుకొని కేఎఫ్‌సి చికెన్ టైప్ రెసిపితో  కేఎఫ్‌సి టైప్ ఫ్రైడ్ చికెన్ తయారు చేశారు.

చిరు వాళ్ల మనుమరాళ్లను ‘మీరు బాగా ఎక్స్‌పర్ట్స్ అయిపోయారు రోడ్డు మీద బండి పెట్టుకొని కేఎఫ్‌సి.. కేఎఫ్‌స్ చికెన్ అని అమ్మేయొచ్చు’ అని సరదాగా ఆట పట్టించారు. అలా మొత్తానికి చిరంజీవి తన మనువరాళ్ల కోసం వారితోనే కలిసి కేఎఫ్‌సి చికెన్ ప్రిపేర్ చేశారు.