‘చిత్రం’ మూవీ సీక్వెల్

టాలీవుడ్ కు ఎంతో మంది కొత్త నటీనటులను పరిచయం చేసిన దర్శకుడు తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా  అలివేలుమంగ వెంకటరమణ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలివేలుమంగ వెంకటరమణ చిత్రం గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సమయంలోనే బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ ముఖ్య పాత్రలో బోల్డ్ కంటెంట్ తో యూత్ సెంట్రిక్ గా ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్న తేజ మరో వైపు తన కెరీర్ లోనే ఒక బిగ్ సక్సెస్ గా నిలిచిన ‘చిత్రం’ సీక్వెల్ ను చేసే పనిలో కూడా ఉన్నాడట. రెండు నెలల క్రితం తేజ జూమ్ మరియు హలో యాప్స్ ద్వారా కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహించాడట. అందులో కొందరిని ఎంపిక చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇప్పిస్తున్నాడట. వారితో వచ్చే ఏడాదిలో సినిమా ఉంటుందని అంటున్నారు.

ఆడిషన్స్ లో తీసుకొన్న  కొత్త వారిని ‘చిత్రం’ మూవీ సీక్వెల్ కోసం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఉదయ్ కిరణ్ రిమాసేన్ జంటగా తెరకెక్కిన చిత్రం అప్పట్లో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఆ సినిమాకు మంచి సీక్వెల్ స్క్రిప్ట్ సెట్ అవ్వడంతో అంతా కొత్త వారితో సీక్వెల్ ను చేసేందుకు సిద్దం అవుతున్నాడట. వెబ్ సిరీస్ పూర్తి అయిన తర్వాత అలిమేలుమంగ వెంకటరమణ చిత్రం ఆ తర్వాత ఈ సీక్వెల్ ను చేసే అవకాశం ఉందంటున్నారు.