చొల్లంగి గ్రామ ప్రజల దీక్షకు మద్ధతు తెలిపిన పితాని

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబందించిన సుమారు 4 ఎకరాల ప్రభుత్వం భూమిని ఇండ్ల స్థలాల కోసం కాకినాడ రూరల్ వారికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చొల్లంగి గ్రామ ప్రజలు తలపెట్టిన మూడవ రోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన రాష్ట్ర జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. తదనంతరం చొల్లంగి గ్రామ ఇళ్ల పట్టాలను చొల్లంగి గ్రామ లబ్దిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ వారికి అడ్రెస్ చేస్తూ జాయింట్ కలెక్టర్ వారికి మరియు కాకినాడ ఎం.డి.ఓ కార్యాలయం నందు ఎం.డి.ఓకి అడ్రెస్ చేస్తూ పరిపాలన అధికారివారికి వినతిపత్రం అందించిన రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాట్లసుబ్బరాజు (బుచ్చిబాబు). ఈ కార్యక్రమంలో అత్తిలి బాబురావు, పుణ్యమంతుల సూరిబాబు, సుంకర రామచంద్రరావు, దూడల స్వామి, గుద్దటి విజయ్,కట్టా త్రిమూర్తులు,కనకాల పెదబాబు,మందపాటి సత్యనారాయణ రాజు, సూరంపూడి కుమార్,వెలుగుబంట్ల సూరిబాబు, పుణ్యమంతుల చినబాబు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు చొల్లంగి గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.