‘సీటీమార్‌’ సెన్సార్‌ పూర్తి

దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీమార్‌’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న థియేటర్లోకి రానుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా రూపొందిన ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.