‘ఫైటర్’కు లైన్ క్లియర్.. జనవరి నుంచి షూటింగ్ మొదలు..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో వస్తోంది. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కరోనా కారణంగా వాయిదా పడింది.

త్వరలో నే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలు కాబోతుందని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. కథ ప్రకారం ఫైటర్ సినిమా అమెరికా, ముంబైలో ఎక్కువశాతం షూట్ చేయాల్సి ఉంది. కరోనా కారణంగా విదేశాల్లో షూట్ చేసే అవకాశం లేకపోవడంతో ఫైటర్ షడ్యూల్ ను ముంబైలోనే పూర్తిచేయాలని చూస్తున్నాడు పూరీ. దీంతో ఈ సినిమా షూటింగ్‌ జనవరి నుంచి మొదలు కానుంది. అలాగే సంక్రాంతికి ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేసే ఆలోచన చేస్తుందట పూరి టీమ్‌. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా సినిమాను కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు.