‘కలర్ ఫొటో’ కొత్త రికార్డ్

ఆహా ప్లాట్ ఫాంలో ప్రేక్షకులు కలర్ ఫొటో చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆహా ప్లాట్‌ఫాంలో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. కలర్ ఫొటో చిత్రం ఆహాలో 50 మిలియన్ల నిమిషాలు స్ట్రీమింగ్ అయింది. థియేటర్లు తెరవని కరోనా పరిస్థితుల్లో కలర్ ఫొటో ఇలాంటి ఘనత సాధించడం విశేషమని చెప్పొచ్చు. సాయి రాజేశ్‌ సినిమాకు కథనందించగా..సునీల్ కీలక పాత్రలో నటించాడు. సునీల్ పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.