ముత్యాల కామేష్ తో సమావేశమైన కొలుసు పార్థసారథి

నూజివీడు నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యాల కామేష్ తో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సమావేశం అయ్యారు.
నూజివీడు నియోజకవర్గం నుండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అని పరిష్కరిస్తానని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే అభివృద్ధి విషయంలో వెనకబడి ఉన్న నూజివీడుని అభివృద్ధి చేసే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకుంటాను అని జనసేన నాయకులకు సారధి హామీ ఇచ్చారు. గత నాలుగున్నర సంవత్సర కాలంగా నూజివీడు నియోజకవర్గం లొ ప్రజల తరఫున అధికారులను ప్రశ్నిస్తు సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ చిత్తశుద్ధిగా జనసేన పార్టీ గొంతుకై పనిచేస్తున్న ముత్యాల కామేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. తన స్వగృహానికి వచ్చిన కొలుసు పార్థసారధిని ఘనంగా సత్కరించి నూజివీడు జనసేన నాయకులను సారధికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు పట్టణ టిడిపి అధ్యక్షులు మలిశెట్టి జగదీష్, నూజివీడు పట్టణ మాజీ అధ్యక్షులు నూతక్కి వేణు, క్లస్టర్ ఇంచార్జ్ మండా శీను, 28 వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు రాయి రంగారావు, ఏలూరు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మల ఆది, ముసునూరు మండలం టిడిపి అధ్యక్షులు నూజివీడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దేవినేని డైలారం, 28వ వార్డు జనసేన నాయకులు దద్దనాల శివ, జనసేన సోషల్ మీడియా నాయకులు ముమ్ములనేని సునీల్ కుమార్, నూజివీడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇంటూరి చంటి, నూజివీడు పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు దారుగా జగదీష్, వేణు బేకరీ అధినేత కొన్నంగుంట వేణు, కాపు సంఘము నాయకులు బండారు శివ, యాదవ సంఘం నాయకులు తొందురు రాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కుక్కడపు అనిల్, పెనమలూరు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కోప్పరాజు సురేష్, నందనంతోట జనసేన నాయకులు మందపాటి ఖుషి తదితరులు పాల్గొన్నారు.