రండి.. మీ సమస్యల పరిష్కారానికై జనసేనాని సిద్ధంగా ఉన్నారు: అనురాధ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజక వర్గంలో, రాయవరం మండలంలో పలు సమస్యలతో కష్టాల్లో ఉన్నవారికి, ప్రజలకు, జనసైనికులకు తెలియజేయునది ఏమనగా కష్టాలతో పలు ప్రజా సమస్యలతో పరిష్కారం దొరకక, బాధపడుతున్నట్లు ఎవరైనా ఉంటే, ఆ సమస్యలను పరిష్కారం చూపించే గొప్ప నాయకుడుగా జనసేనాని మీకోసం సిద్ధంగా ఉన్నారని, ఈనెల జూలై 10 వ తారీకు ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు బెంజ్ సర్కిల్ దగ్గరలో ఈ జనవాణి కార్యక్రమం జరుగుచున్నది. ఎవరైనా ఆ పలు ప్రజా సమస్యలపై అర్జీలను జనసేనానికి స్వయంగా అందించగలరని కోరుచున్నామని మండపేట నియోజకవర్గo రాయవరం మండలం చెల్లూరు గ్రామ ఎంపీటీసీ-1 గొల్లపల్లి అనురాధ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న వారి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని జనసేనాని ప్రవేశపెట్టడం పలు ప్రజల సమస్యల కొరకు అధికారం లేకపోయినా.. మీ వెనుక కొండంత అండగా నేనున్నానని భరోసానివ్వడం.. ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా అనురాధ.. జనసేనాని సేవలను.. వారు ప్రజల పట్ల చూపుతున్న మానవత్వానికి, అంకితభావానికి కొనియాడారు.