జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు తరలి రండి: ఉప్పు వెంకట రత్తయ్య

మార్చి 14 వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం నందు జరగబోయే జనసేన పార్టి ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గం లో జనసేన పార్టీ వివిధ మండలాల అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టి జిల్లా ప్రధానకార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ మన ప్రత్తిపాడు నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు భారిగా తరలి రావాలని కోరినారు. రాష్ట్రంలో నేడు అధికారం అనుభవిస్తున్న పార్టి గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చక పధకాలను కుంటుపడిపొయినాయని వెంకట రత్తయ్య అన్నారు. జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ.. మా అధ్యక్షులు రేపు ఇప్పటం సభలో పార్టీ దిశానిర్దేశం చేసే విధంగా కార్యకర్తలను నాయకులను సమయత్తం చేయనున్నారని అన్నారు. సంయుక్త కార్యదర్శి చట్టాల త్రీనాధ్ మాట్లాడుతూ.. ప్రతి జనసైనికుడు క్రమశిక్షణ తోటి సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు ప్రత్తి భావన్నారాయణ, మక్కే సురేష్, కోల్లా లీలా గోపినాథ్, గడ్డం శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షులు నాగాంజనేయలు, మేరికేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.