‘బీస్ట్‌’గా కనువిందు చేయనున్న దళపతి విజయ్‌

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ పుట్టిన నేడు. అయితే, ఆయన అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌ ఆరంభమయ్యాయి. డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌తో చేస్తున్న ఆయన తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం నిన్న రిలీజ్‌ చేసింది. దీంతో నెట్టింట్లో ఆయన అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది.

ఇక ఆయన 65వ చిత్రమయిన దీనికి ‘బీస్ట్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో రానున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చెందిన ఫస్ట్‌ లుక్‌లో విజయ్‌ అదిరిపోయారు. నల్ల ప్యాంటు, తెల్ల బనియన్‌ ధరించి ఉన్న దళపతి చేతిలో తుపాకితో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.