పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

పెద్దాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ లలో సిఐ కి సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి వల్గర్ గా మాట్లాడుతున్న వైసీపీ సోషల్ మీడియా మరియు వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి పిట్టా జానకి రామారావు, పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, పెద్దాపురం, సామర్లకోట పట్టణ నాయకులు మరియు మండల నాయకులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.