కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లపై ఆడిట్‌ చేపట్టండి: మోడీ

రాష్ట్రాలకు కేంద్రం అందించిన వెంటిలేటర్ల ఏర్పాట్లు, వాటి పని తీరు గురించి తక్షణమే ఆడిట్‌ నిర్వహించాలని ప్రధాన మంత్రి మోడీ శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వ్యాఖ్యానించారు. కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేర్లను వినియోగించలేదన్న నివేదికలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము అందించిన వెంటిలేటర్ల ఏర్పాట్లు, చర్యలపై ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు వీటి పట్ల ట్రైనింగ్‌ ఇవ్వాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని సూచనలు చేశారు. పాజిటివి రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ఇంటింటికీ పరీక్షలు చేపట్టి..నిశితంగా దృష్టి పెట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సరఫరా పంపిణీని నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.