తమిళనాట నడిగర్ సంఘం రచ్చ

తమిళ ఇండస్ట్రీలో నడిగర్ సంఘం రాజకీయాలు తమిళ రాజకీయాలని విస్మయానికి గురిచేసే స్థాయిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.  శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి అక్కడ నిత్యం గొడవలు కొనసాగాయి. మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్ అవినీతికి పాల్పడ్డాడని, సంఘం నిధుల్ని దుర్వినియోగం చేశాడంటూ ఎన్నకల బరిలో విశాల్‌, అతని ప్యానెల్ శరత్‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో నడిగర్ సంఘం వార్తల్లో నిలిచింది.

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో విశాల్ ప్యానల్ సభ్యులు విజయం సాధించారు. ఈ ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయినా నడిగర్ సంఘంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిత్యం గొడవలతో మారుమ్రోగిపోతూనే వుంది. నాజర్ అధ్యక్ష పీఠం ఎక్కిన తరువాత 10 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో తమిళనాట నడిగర్ సంఘం రచ్చ మొదలైంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ గెలిచాకా ఇవి పరాకాష్టకు చేరుకున్నాయి. అప్పటి నుంచి వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం వర్గ పోరు మొదలైంది. విశాల్ ప్యానెల్ నుంచి నాజర్ అధ్యక్షపీఠాన్ని ఎక్కారు. అయినా అలజడి … గొడవలు నిత్యకృత్యంగా మారాయి.నాజర్ నాయకత్వంలోనూ అవకతవకలు జరిగాయని పదికోట్ల వరకు నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోలీవుడ్ లో కొత్త డ్రామా మొదలైంది. ఖర్చుల పద్దులపై ఆరాలు తీస్తుండడం.. సంఘానికి వచ్చే రాబడి ఖర్చులు ఎంత అనే లెక్కలు తేల్చాలని సభ్యులు పట్టుబట్టడంతో నడిగర్ సంఘం కార్యాలయంలో రచ్చ రచ్చ సాగుతోంది. సడెన్ గా ఊహించని ట్విస్టు. సంఘంలో అగ్ని ప్రమాదం జరగడం.. కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడంతో ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

తప్పులున్నాయని లెక్కలు అడిగాం కాబట్టే ఆధారాలు లేకుండా చేయడానికే అగ్ని ప్రమాదం నాటకం ఆడారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాల్సిందే అంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కార్యదర్శిగా వ్యవహరిస్తున్న హీరో విశాల్ వ్యవహార శైలిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎటు టర్న్ తీసుకుంటుందోనని కోలీవుడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఈ వివాదంపై కమల్- రజనీ స్పందించాలని కోరుతున్నారు.