యల్లటూరు శ్రీనివాసరాజు కృషి అభినందనీయం

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణంలో ఉన్న యల్లటూరు భవన్, జనసేన పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ బుడ్డా శరత్ బాబు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజును కలిసి ఆయన జనసేన పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని అభినందించి, రాజంపేట నియోజకవర్గంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు హరిరామ జోగయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ కోసం రాజంపేట నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు కోసం బూత్ లెవల్ నుండి ప్రతి కార్యకర్త పనిచేసి రాబోయే ఎన్నికలలో రాజంపేటలో జనసేన పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తామని తెలిపి ప్రజలకు మీలాంటి ఉన్నత విద్యావంతులు కావాలని ప్రజలకు, ఎంతో సేవ చేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయంగా తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల చలపతి తదితరులు పాల్గొన్నారు.