ఏళ్ళు గడుస్తున్నా పూర్తికాని కేటీ రోడ్‌ నిర్మాణం

  • గత డిసెంబర్‌ లో మంత్రి బొత్సా చేతుల మీదుగా శంకుస్థాపన
  • ఏడాది కాబోతున్నా ఇంకా నిర్మాణ దశలోనే
  • ఇబ్బందులకు గురవుతున్న వాహన చోదకులు, ప్రజలు
  • రోడ్డు నిర్మాణం పూర్తి అయితే చిన్నపాటి వర్షానికి సైతం ముంపునకు గురయ్యే అవకాశం
  • త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో డ్రైనేజ్‌, పైపులైన్ల సమస్యలను పక్కన పెట్టిన వైనం
  • ప్రజల ఇక్కట్లు అధికారులకు పట్టవా…!
  • ముందు చూపులేకుండా పనులు చేయిస్తున్న స్థానిక ఎమ్మెల్యే
  • ఇదేనా అభివృద్ధి… ఇదేనా మీ పనితీరు..?
  • జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ ధ్వజం.

విజయవాడ, స్థానిక వన్‌ టౌన్‌ లోని కేటీ రోడ్‌ నిర్మాణ పనులకు బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకటమహేష్‌ పరిశీలించారు. ఈ క్రమంలో 51వ డివిజన్‌ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర రావు, 50వ డివిజన్‌ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల గురించి, వాటి వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు. అనంతరం పోతిన మహేష్‌ మాట్లాడుతూ కేటీ రోడ్డు నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబర్‌ లో మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన సంగతి అందరికి విధితమే. శంకుస్థాపన చేసి ఏడాది గడిచిన ఇంకా నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. అలాగే పాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వాటర్‌ పైపులైన్లను తొలగించకుండా యధావిధిగా రోడ్డు నిర్మాణం చేపడితే భవిష్యత్తులో వాటిని తొలగించాల్సి వచ్చినపుడు వేసిన రోడ్డు ఏమి చేస్తారని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం పూర్తి అయితే మహంతిపురం మొత్తం ముంపునకు గురవుతుందని అధికారులు ఆ మాత్రం తెలియకుండా ముందుకు సాగిస్తున్నారు? అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృధి పథంలోనే నడిపిస్తున్నామని గొప్పలకు పోయే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఆ మాత్రం ముందు చూపు లేకపోవటం శోచనీయమన్నారు. ఇదేనా మీ అభివృద్ధి..? ఇదేనా మీ పనితీరు..? అని అన్నారు. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు నిర్మాణ పనులు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత రాష్ట్ర కార్యదర్శి నెమల సంజీవరావు, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, పిళ్లా శివ, రెడ్డిపల్లి నవీన్, సబిన్కర్ నరేష్, చీరంజీవి, రాజు, పి దుర్గారావు, మణికంఠ, కళ్యాణ్, సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.