కరోనా ఎఫెక్ట్‌.. 16 రైళ్లు రద్దు..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్వీసులను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా.. మరో 16 ట్రెయిన్లను రద్దు చేసింది. ఈ నెల 7 నుంచి రైళ్లు అందుబాటులో ఉండవని, ఈ మేరకు ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు విచారం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైళ్లు నిలిపి వేయనున్నట్లు తూర్పు రైల్వేశాఖ తెలిపింది. హౌరా-రాంచీ (02019), రాంచీ-హౌరా (02020), హౌరా-ధన్‌బాద్ (02339), ధన్‌బాద్‌ – హౌరా (02340), హౌరా-అజీమ్‌గంజ్ (03027), అజీమ్‌గంజ్-హౌరా (03028), హౌరా-రాంపూర్హాట్ (03047), రాంపూర్హాట్-హౌరా (03048), కోల్‌కతా-లాల్‌గొల (03117), లాల్‌గొల – కోల్‌కతా (03118) సీల్దా – రాంపూర్హాట్ (03187), రాంపూర్హాట్-సీల్దా (03188), భగల్‌పూర్‌ – దానాపూర్‌ (03401), దానాపూ – భగల్పూర్‌ (03402) అసన్సోల్‌ – హల్దియా (03502), హల్దియా-అసన్సోల్ (03501) ట్రెయిన్లు రద్దయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తుండగా.. మరికొన్ని లాక్‌డౌన్‌ తరహాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వేశాఖ ఇటీవల పెద్ద ఎత్తున సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. ఇటీవల నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే రీజియన్‌లో 40 రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే దక్షిణ మధ్య రైల్వేలోనూ 21 సర్వీసులు రద్దయ్యాయి.