నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు కరోనా

సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన సుప్రీం జడ్జీలు సోమవారం వరకు కోర్టు విచారణలు చేపట్టినట్లు ఓ కథనం ద్వారా వెల్లడైంది. ఒక న్యాయమూర్తిని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సుప్రీంకోర్టులో ఇన్‌ఫెక్షన్ రేటు అధికంగా ఉన్నది. జస్టిస్ ఎంఆర్ షా అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా వైరస్ సంక్రమించింది. ఇప్పటి వరకు సుప్రీంలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా సోకింది. కోర్టుకు రాలేని పక్షంలో ఇంటి నుంచి పనిచేయాలంటూ ఏప్రిల్ 13వ తేదీన సుప్రీం రిజిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కొన్నది.