కాపు నేతకు నివాళులు అర్పించిన కౌన్సిలర్ విజయలక్ష్మి

డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోన సీమజిల్లా, కాపు రత్న, కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత నల్లా సూర్యచంద్రరావు 10వ వర్ధంతి వేడుకలు 9వ వార్డు నల్లా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు జనసేన కౌన్సిలర్ గోలకోటి విజయలక్ష్మి, వాసు దంపతులు స్వర్గీయ నల్లా విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.