ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్‌డేట్

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవల ప్రకటించారు మేకర్స్.

స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మేకర్స్ తాజాగా సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. మధ్యాహ్నం మూవీ నుండి అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలియజేశారు. అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.