సంక్షేమ పథకాలకు ఆద్యుడు దామోదరం సంజీవయ్య

గుంటూరు: పేద ప్రజలకు, వృధ్యాప్యంలో ఉన్నవారికి అండగా నిలిచే సంక్షేమ పథకాలకు ఆద్యుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా లాలుపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేసినా తరతరాలు గుర్తుండిపోయేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించారని కొనియాడారు. తన హయాంలో అవినీతి అనే పధమే వినపడకూడదని ఏసీబీ వంటి వ్యవస్థలను నెలకొల్పిన ఆదర్శనీయుడు దామోదరం సంజీవయ్య అని అన్నారు. ముఖ్యమంత్రి పదవితో పాటూ ఎన్నో ఉన్నతస్థాయి పదవులు చేపట్టినా ఒక్క సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదన్నారు. దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని కొర్రపాటి నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కాటూరి శ్రీనివాసరావు, నాగం అంకమ్మరావు, తోట శివ, అక్కి రవి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, తన్నీరు రాము, శృంగారపు భాస్కర్, కన్నా గోపి, శీలం హరి, శీలం వెంకటేశ్వరరావు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.