దర్శి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలో ఆదివారం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని గంగమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దర్శి నియోజకవర్గ నిస్వార్ధ జనసైనికులకు జనసేన పార్టీకి వారి వంతుగా కృషి చేస్తున్నటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బద్దుల లక్ష్మయ్య, కొల్లా హనుమంతరావు, కొంకాల రామ్మోహన్ మరియు గనప శ్రీను జనసేన పార్టీ బలోపేతం కావడానికి జనసైనికులు చేయవలసిన మరియు పాటించవలసిన విధివిధానాలను తెలుపుతూ ప్రతి ఒక్కరూ దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న వరికూటి నాగరాజుకి సహకరించాలని తద్వారా జనసేన పార్టీని బలోపేతం చేసుకుని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని విధాల కృషి చేద్దాము అని తెలియజేయడం జరిగినది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన కార్యకర్తలతో వరికూటి నాగరాజు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరాల ఏమైనా ఉంటే తెలుపగలరు అని అడుగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దర్శి నియోజకవర్గ జనసైనికులు వారి మండలం మరియు గ్రామాలలో ఉండే సమస్యలను వరికూటి నాగరాజు దృష్టికి తీసుకురావడం జరిగినది. ఈ సమస్యల గురించి రికూటి నాగరాజు మాట్లాడుతూ మీరు చెప్పిన అన్ని సమస్యలపై దృష్టి పెడతామని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కొన్ని సమస్యలను తీసుకువెళ్తాము అని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయిన వరికూటి నాగరాజు ప్రజలకు మరియు జనసేనకులకు అండగా నిలబడే విషయంలో ఎంత దూరమైనా వస్తానని అందుకోసం ఏమైనా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నన్ను నలుగురు మోసే వరకు నేను జనసేన పార్టీతోనే ఉంటాననే మాటను గుర్తుకు తీసుకొస్తూ నా ఈ జీవితం పవన్ కళ్యాణ్ కి అంకితం వారితోనే నా జీవిత ప్రయాణం అంటూ తెలియజేస్తూ జనసైనికులకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని జనసేన బలోపేతం కొరకు అందరిని కలుపుకోవాలని ఉద్దేశంతోనే దర్శి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా సంతోషిస్తాము అని నాగరాజు గారు తెలియజేస్తూ నా ముందున్న బాధ్యత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే నా ఆశయం అని జనసైనికులు తెలియజేస్తూ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ జనసేన పార్టీ తరఫున దర్శి నియోజకవర్గ జనసేనకులకు భరోసాను కల్పించే విషయంలో ఎప్పుడూ ముందుంటానని తెలియజేయడం జరిగినది.