ప్రభాస్ చిత్రానికి దీపికా షాక్..

వరుస పాన్ చిత్రాలను ప్రకటిస్తూ అభిమానులు సంబరాల్లో నింపుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు పాన్ చిత్రాలను ప్రకటించాడు. వాటిలో ఒకటి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోయే మూవీ. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ హాట్ ఫేవ‌రేట్ దీపికా ప‌దుకునే న‌టించ‌నుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి దీపికా షాక్ ఇచ్చింది.

కొన్ని కారణాల కారణంగా ఆమె ఈ సినిమాకు ఆలస్యంగా చేరనుంది. అయితే నిజానికి దీపికా ఈ ఏడాది సగం నుంచి ప్రభాస్, నాగశ్విన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ హిందీలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకి కూడా అవే డేట్స్ ఇవ్వడంతో ప్రభాస్ సినిమాకు ఆలస్యంగా చేరనుంది. అయితే హృతిక్ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనుంది. ఈ విషయంలో నాగశ్వన్ దీపికను ఈ ఏడాది చివరికి డేట్స్ ఇవ్వమని కోరాడు. అందుకు దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.