తాడేపల్లిగూడెం సభతో వైసీపీ ఓటమి ఖాయం అయ్యింది

  • టీడీపీ జనసేన కూటమిని ఆశీర్వదించిన ప్రజలు
  • పోలీసుల్ని అడ్డుపెట్టుకుని సభని ఫెయిల్ చేయాలని చూసారు
  • సభాప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు
  • జగన్ ఇప్పుడు చొక్కాలు మడతపెట్టంటున్నారు… వైసీపీ అరాచకాలపై నాలుగేళ్ళ క్రితమే మేము చొక్కా మడతపెట్టాం
  • వైసీపీని ఓటమి నుంచి ఎవరూ కాపడలేరు
  • 45 రోజుల తరువాత రాష్ట్రానికి మంచిరోజులు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: జనసేన తెలుగుదేశం పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో జరిగిన తొలి బహిరంగ సభ ఊహించని స్థాయిలో విజయవంతం అయ్యిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. టీడీపీ, జనసేన పొత్తుకి పెద్దఎత్తున ప్రజా మద్దతు లభించటంపై తాడేపల్లి ప్యాలెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. ఈ సభతో తమ పని అయిపోయిందంటూ వైసీపీ నేతలే అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారని , వైసీపీని ఓటమి నుంచి ఇక ఏ శక్తి కాపడలేదని ఆయన అన్నారు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ విజయవంతం అయిన సందర్భంగా 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని సభకి వచ్చేవారిని ఎక్కడికక్కడ ఆపేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణం చేరుకునే దారులన్నింటిని పోలీసులతో మూసేసినా ప్రజలు భారీ సంఖ్యలో రావటం ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదన్నారు. సభాప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో బయట అంతకుమించి ప్రజలున్నారని తెలిపారు. పోలీసులు వైసీపీ నాయకులకు ఒక్కరికే కాదని రాష్ట్ర ప్రజలందరికీ తాము బాధ్యత వహిస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సభతో జగన్ అడ్రెస్ గల్లంతు అవుతుందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో విధ్వంసం సృష్టించేందుకు స్వయానా ముఖ్యమంత్రి ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలు చొక్కా మడతపెట్టాలని పిలుపునిచ్చారని, వైసీపీ అరాచకాలను ఎదురుకునేందుకు జనసైనికులు నాలుగేళ్ళ క్రితమే చొక్కా మడతపెట్టారన్న విషయాన్ని వైసీపీ గుర్తిస్తే మంచిదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. జగణాసురుడి పీడ విరగడయ్యి 45 రోజుల్లో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో 22 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, నాజర్, నండూరి స్వామి, బాలు, షేక్ గౌస్, జిలాని, కోలా మల్లి, పోతురాజు, ఆదాం, చింతకాయల సాయి, చంద్రశేఖర్, పూసల శ్రీను, చంద్రబాబు, బియ్యం శ్రీను, అలా కాసులు, సాయి తదితరులు పాల్గొన్నారు.