రాయలసీమలో తీరని దాహం

మదనపల్లె, రాయలసీమ కరువు ప్రాంతం. వేసవికాలంలో మంచినీటి పథకాల నుండి తాగునీటి సరఫరా అవుతున్న వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది ఫలితంగా దాహం తీర్చుకునేందుకు పట్టణ జనం నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ పథకాలకు ప్రభుత్వం అరకొరగా వ్యయం చేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. చాలా ప్రాంతాల్లో పైపులైన్లు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలోనే పైపులైన్లు ఉన్నాయి. దీంతో తాగునీరు కలుషితం అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలకు నీటిని కొనుగోలు చేస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పటికి తాగునీటి పైపులైన్ల విస్తరణ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారున్న విమర్శలున్నాయి. రాయచోటి ప్రాంతంలో రోజుకు అవసరమైన నీరు 1.50 కోట్లు లీటర్లు. రోజుకి సరఫరా అవుతున్న నీరు 80 లక్షల లీటర్లు మాత్రమే అదేవిధంగా మదనపల్లిలో సరఫరా చేయాల్సిన నీరు 2.25 కోట్లు లీటర్లు రోజుకు 75 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పురపాలక సంఘాలు తాగునీటి అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్లను విస్తరించడం లేదు. మొదట్లో వేసిన గొట్టాల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కారణంగా డిమాండ్ మేరకు చేయలేకపోతున్నారు. బోరు బావులు, ట్యాంకర్ల నీటి పైన మీదనే ప్రజలు ఆదారపడుతున్నారు. మదనపల్లె పట్టణంలో అమ్మ చెరువు మిట్ట, శ్రీవారి నగర్ కాలనీ, కనకదాసు కాలని, మంజునాథ కాలనీ, వాల్మీకి నగర్, కోల్ల ఫైలు, వైయస్సార్ కాలనీ, చిలకలగుట్ట తదితర ప్రాంతాల వారికి ట్యాంకర్ల ద్వారా రోజుకి కొంత నీరు ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. ట్యాంకు రెండు మూడు రోజులకు ఒకసారి వీధిలోకి వస్తోంది. అవసరాలకు మీరు నీటి సదుపాయాలు ఏమాత్రం చేయడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతాలకు పైపులైన్లు వేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పురపపాలక సంఘం వారిది. పైపులైన్లు విస్తరించండి, ఈ ప్రాంతాలకు ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత పురపాలక సంఘం మీద ఉంది. సంఘంలో ఉన్న నిధులతో అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా చేసే చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి దారం అనిత అన్నారు.