ధనుష్‌ ‘కర్ణన్‌’ ఫస్ట్‌లుక్‌

ధనుష్‌ హీరోగా మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్ణన్‌’. ‘పరియేరుం పెరుమాళ్‌’ చిత్రం తర్వాత మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను హీరో ధనుష్‌ పూర్తి చేసి, ఓ హాలీవుడ్‌ చిత్రం షూటింగ్‌ నిమిత్తం అమెరికారు వెళ్ళారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘కర్ణన్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో హీరో తల, చేతులకు రక్తం అంటుకుని వుండగా, చేతులకు సంకెళ్ళు వేసివున్న దృశ్యం ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో ఏప్రిల్‌ 9న థియేటర్లలో ‘కర్ణన్‌’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు హీరో ధనుష్‌ తన ట్విట్టర్‌ లో వెల్లడించారు. కాగా, ధనుష్‌ నటించిన మరో చిత్రం ‘జగమేతందిరం’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.