జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తధాన శిబిరం

  • గత నాలుగు సంవత్సరాలుగా 7200 మందితో రక్తదానం
  • శ్రీకాకుళం లైన్స్ బ్లడ్ బ్యాంక్ సునీల్ సహకారంతో మరియు ధరంపురం జనసైనికుల సహాయంతో 10వ రక్తధాన శిబిరం ఏర్పాటు

ఇచ్చాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఉద్దానం ప్రాంతంలో రక్తం అందక ఎవరూ కూడా మరణించకూడదని జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా 7200 మందితో రక్తదానం చేయించారు, ఈ కార్యక్రమంలో భాగంగానే శనివారం ఇచ్చాపురం మండలం, ధరంపురం గ్రామంలో శ్రీకాకుళం లైన్స్ బ్లడ్ బ్యాంక్ సునీల్ సహకారంతో మరియు ధరంపురం జనసైనికుల సహాయంతో 10వ రక్తధాన శిబిరం ఏర్పాటు చేయగా 51 మంది రక్తదానం చేయటం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి రాజు మరియు రాష్ట్ర మత్స్య విభాగ కార్యదర్శి నాగుల హరిబేర చేతుల మీదగా ప్రారంభిండం జరిగింది. ఈ కార్యక్రమంలో ధరంపురం జనసైనికులుతో పాటు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతీ ఒక్క జనసైనికులకు, వీరమహిళలకు ధన్యవాదాలు తెలియపరిచారు.