పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎవరైనా మీకు ఫిర్యాదు చేసారా…?

  • వాసిరెడ్డి పద్మను ప్రశ్నించిన నిమ్మకాయల రాము

అనంతపురం, వాసిరెడ్డి పద్మ నోటీస్ రాజ్యాంగ విరుద్ధం. వ్యకి యొక్క ప్రాథమిక హుక్కులు, వ్యక్తిగత ప్రతిష్ఠకి భంగం కలిగిస్తుంది. మీరు మన చట్టంలో ఏ పరిధి ప్రకారం నోటీస్ విడుదల చేసారు? పోనీ కళ్యాణ్ మాజీ భార్య ఎవరైనా మీకు పిర్యాదు చేసారా.? ఎవరో మెప్పు కోసం చేశారు…? మీ రాజకీయ కక్ష కోసం అధికార దుర్వినియోగం చేస్తారా? అంటే మీ దృష్టిలో వివిధ వ్యక్తిగత కారణాలతో విడిపోయిన అందరికీ నోటీసులు ఇస్తారా..?. అలా విడిపోయిన వారు మరల కొత్త జీవితం కొనసాగించకూడదా? అసలు రాజ్యాంగ కల్పించిన హక్కులను ఏ విధంగా హరిస్తారు. విడిపోయిన భర్త తన భార్య జీవితం సుఖప్రదంగా ఉండలని భరణం ఇవ్వడం తప్పా..? అంటే భరణం ఇవ్వడం న్యాయ విరుద్ధమా. రాజ్యాంగ విరుద్ధమా. భారతీయ చట్టాలు మీద మీకు గౌరవం ?… మరి వివాహ చట్టాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా అతిక్రమించారా? దయచేసి పై ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే నోటీస్ విత్ డ్రా చేసుకొని భారత రాజ్యాంగనికి క్షమాపణ చెప్పాలి. ఎవరో మెప్పు కోసం.. లేదా మీ అధికారం కాపాడుకోవడానికి మీ అధికార దుర్వినియోగం చేసి మీరు బలి కావద్దని జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము అన్నారు.