కనిగిరిలో డిజిటల్ క్యాంపెయిన్

కనిగిరి, జనసేన పార్టీ సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా కనిగిరి-కంభం రోడ్డు ప్రధాన రహదారిలో శనివారం గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి జనసేన పార్టీ కనిగిరి జనసేన నాయకులు పాల్గొని రోడ్డు యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను గత మూడు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు దొరస్వామి, మండల అధ్యక్షులు రమేష్, టౌన్ అధ్యక్షులు అంజి నాయుడు, జనసేన నాయకులు తోట బాలు, చంటి, సాయి కిషోర్, అక్బర్ కార్యకర్తలు పాల్గొన్నారు.