రంపచోడవరంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సారథ్యంలో రెండవ రోజు గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో ఆదివారం అడ్డతీగల మండలం భీమవరం పంచాయతీ కోవెలపాలెం గ్రామంలో రహదారిలో గుంతల రోడ్డు వద్ద నిరసన హలో ఏపీ బై బై వైసిపి అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, చోళ్ళ కృష్ణారెడ్డి, పొడుగు సాయి, ప్రసాద్, వెంకన్న, స్వామి, తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండలం నాయకులు వీరలక్ష్మి, సత్యవతి, పండు రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.