గోరంట్ల జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

గోరంట్ల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ పోగ్రాం లో భాగంగా శుక్రవారం గోరంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో బూదిలి దగ్గర గల వంతెన తెగిపోయి సంవత్సరం పైన కావొస్తున్న దాని మరమ్మతులు చేయలేదు అని ఈ వంతెన తెగిపోతే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన ఏర్పాటు చెయాలి అని అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, కార్యక్రమల జిల్లా కమిటి సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల నాయకులు ఎముకలగుట్టపల్లి వెంకటేష్, సంతోష్, గొల్ల అనిల్ కుమార్, నాగేష్, మల్లికార్జున, తిరుపాల్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.