తాడిపత్రి జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

తాడిపత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ కాంపెయినింగ్ #ఘూదంఒర్నింగ్ఛంశిర్ లో భాగంగా తాడిపత్రి పట్టంలో బైపాస్ రోడ్డు దుస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా తాడిపత్రి జనసేన నాయకులు జనసైనికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అనంతపురం నుండి కడప, నెల్లూరు, కాకినాడ మొదలైన ప్రధాన నగరాలను కలిపే హైవే రోడ్డు ఇంతటి దయనీయమైన స్థితిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసేలా చేశారు. ఈ కార్యక్రమాన్ని తాడిపత్రి జనసేనపార్టీ నాయకులు కుందుర్తి నరసింహా చారి, రాష్ట్ర చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జనసేనపార్టీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు మాధీనేని గోపాల్, ఆచుకట్ల అల్తాఫ్ మరియు కార్యకర్తలు షేక్ సాధక్ వలి, షేక్ ఇమామ్ వలి, పెడ్డిరాజు, శివకుమార్ రెడ్డి, విజయ్, అజయ్ మొదలైన వారు పాల్గొన్నారు.