జనసేనపార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో డిజిటల్ క్యాంపైనింగ్

చీపురుపల్లి, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి పై డిజిటల్ క్యాంపైనింగ్ నిర్వహించడం జరిగింది. గరివిడి మండలం వెదులవలస నుంచి చీపురుపల్లి రహదారులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ కిమిడి నాగార్జున మరియు జనసేన పార్టీ గరివిడి మండలం అధ్యక్షుడు పెద్ది వెంకటేష్ పాల్గొని రోడ్ యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్ నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాలు, పడుతున్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొడశింగి రామకృష్ణ, ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి ధన్నాన యేసు, బాలకృష్ణ, బాకురు శ్రీను, రాగోలు రామకృష్ణ, పళ్ళికుమార్, సత్యనారాయణ, చిరంజీవి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గరివిడి మండల అధ్యక్షుడు సారిక సురేష్ , జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పైల బలరాం తదితర టీడీపీ వీరమహిళలు నాయకులు, జనసైనికులు కార్యకర్తలు పాల్గన్నారు.