తొలిసారి డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు..

దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు చేపట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే తొలిసారి డిజిటల్ పద్ధతిలో జనాభా గణన ఉంటుందని మంత్రి తెలిపారు. లోక్‌సభలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె మాట్లాడారు. డిజిటల్ జనాభా లెక్కింపు ప్రక్రియ కోసం సుమారు 3700 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సముద్రాల అధ్యయనం కోసం డీప్ ఓషియన్ మిషన్‌ను స్టార్ట్ చేయనున్నామన్నారు. 4 వేల కోట్లతో సముద్రాల సర్వే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు 35 వేల కోట్లు కేటాయించారు. 2025-26 సంవత్సరం వరకు ఈ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మరో 100 సైనిక్ స్కూళ్లను దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయనున్నారు.