పంతం నానాజీ చేతులమీదుగా కళ్ళ జోళ్ళు పంపిణీ

కాకినాడ రూరల్ మండలం, కొవ్వూరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో.. కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో.. కొవ్వూరు గ్రామంలో సుమారు 40 మందికి ఉచిత కంటి ఆపరేషన్స్ చేయడం జరిగింది.. వారందరికి శనివారం కొవ్వూరులో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ చేతులమీదుగా కళ్ళ జోళ్ళు అందించడం జరిగింది.