క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

పెడన, జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం జక్కంచర్ల గ్రామంలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న జన సైనికులకు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నుండి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులుగా భావించి, కార్యకర్తల దృష్టిలో పెట్టుకుని క్రియాశీల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఈ కార్యక్రమానికి పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, మండలాధ్యక్షులు దాసరి ఉమా సాయిరాం, గల్లా హరీష్, శ్రీరాం సంతోష్, చీర్ల నవీన్ కృష్ణ, కనపర్తి వెంకన్న, సమ్మెట గణపతి, అబ్దుల్ నజీర్, మత్తి పూర్ణచంద్రరావు, ఆత్మూరు సుబ్బారావు, బావిశెట్టి సుబ్బయ్య, వెన్నా శ్రీనివాసరావు, ఆత్మూరు శేషగిరిరావు, బాదర్ల శ్రీనివాసరావు జనసైనికులు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.