క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ప్రకాశం జిల్లా, పొదిలి పట్టణం మూడవ వార్డు కాటువారిపాలెం నందు జనసేనపార్టీ నాయకులు సోము వెంకట్రావు మరియు జనసేన పొదిలి మండలం అధ్యక్షులు పెరిసోముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు జోరు వర్షానికి లెక్కచేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.