గరుగుబిల్లి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

  • గర్భాన సత్తిబాబు మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పాలకొండ నియోజకవర్గం: పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పాలకొండ మండలం, గరుగుబిల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసుతో జనసైనికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఒక్కొక్క క్రియాశీలక సభ్యులు 10 మందిని ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే విధంగా పని చెయ్యాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమ జనసైనికులకు అండగా నిలవాలని 5 లక్షల రూపాయలు పథకాన్ని ఏర్పాటు చేశారని, దేశ చరిత్రలో ఏ నాయకుడు కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని గర్భాన సత్తిబాబు అన్నారు. కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సామాజిక న్యాయం సాధ్యమని కూరంగి నాగేశ్వరరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.