వరద బాధితులకు బ్రెడ్, బిస్కెట్లు, జిలేబీలు, సమోసాలు పంపిణీ చేసిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం, వరద బాధిత పునరావాస కేంద్రంగా ఉన్న చినమామిడిపల్లి మున్సిపాలిటీ హైస్కూల్ లో వరద బాధితులకు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ బిస్కెట్ ప్యాకెట్లు, జిలేబీలు, సమోసాలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు గారు, బందెల రవీంద్ర, తోట నాని, గణేశ్న శ్రీరామ్, పసుపులేటి అభి, అయితం చిన్ని, యాతం మహేష్, యర్రంశెట్టి మధు, పిప్పళ్ల దుర్గా ప్రసాద్, కొప్పాడి కనకరాజు మరియు చినమామిడిపల్లి జనసైనికులు పాల్గొన్నారు.