రాజంపేట జనసేన ఆధ్వర్యంలో 60 వేల విలువ గల త్రాగునీటి మోటార్ వితరణ

రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లి మండలంలోని శీకార్ పాలెంలో గ్రామస్తుల అభ్యర్థన మేరకు 60 వేల రూపాయలు విలువ గల త్రాగునీటి మోటారునీ రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ చేతుల మీదుగా అందజేశారు. మా గ్రామంలో త్రాగునీటి సదుపాయం లేదు అన్న విషయాన్ని శ్రీకర్ పాలెం గ్రామస్తులు రాజంపేట వీరమహిళ రెడ్డి రాణి దృష్టికి తీసుకువచ్చారు. మాకు త్రాగునీటి మోటర్ ను ఏర్పాటు చేస్తే గ్రామస్తుల దాహార్తి తీర్చిన వారు అవుతారని శ్రీమతి రెడ్డిరాణి గారిని అభ్యర్థించారు. ఈ విషయాన్ని రెడ్డిరాణి రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించిన దినేష్ 30 వేల రూపాయలు తాగునీటి మోటర్ కు ఆర్థిక సహాయం అందించారు. మిగతా 30 వేల రూపాయలు దాతల సహాయంతో సమకూర్చిన రెడ్డి రాణి వెనువెంటనే 60 వేల విలువగల త్రాగునీటి మోటారును ఏర్పాటు చేసి, గ్రామస్తుల దాహార్తి తీర్చడానికి దోహదపడ్డారు. ఈ త్రాగునీటి మోటారు సమకూర్చి గ్రామస్తుల త్రాగునీటి సమస్య తీర్చినందుకు జనసేన పార్టీ పట్ల జనసేన పార్టీ నాయకులు చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.