జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రైల్వేకోడూరు మండల పరిధిలోని లక్ష్మీ గారి పల్లె గ్రామంలో.. జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో.. గ్రామంలోని కార్యకర్తలకు జనసేన పార్టీ క్రియాశీలక కిట్లను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా గ్రామస్తులతో దినకర్ బాబు మాట్లాడుతూ.. 2024 ఎన్నికలలో పార్టీ ఆదేశాలను అనుసరించి పోలింగ్ ఏజెంట్లు నియామకం మరియు పోల్ మేనేజ్మెంట్ తదితర విషయాలను కూలంకషంగా చర్చించారు.. గ్రామస్తులంతా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు అయినందుకు సంతోషిస్తూ.. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించడమే కాకుండా.. స్వయంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రంగయ్య, పత్తి పురుషోత్తం, బాలిశెట్టి రాజశేఖర్, మర్రిపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.