రామచంద్రపురంలో పండగలా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రామచంద్రపురం నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ 5,00,000 రూపాయల కిట్లు పంపిణీ కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జూన్ 10, 11, 12 వ తేదీలలో రామచంద్రపురం నియోజకవర్గంలో మండలాల వారిగా కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ రోజు ఆదివారం రామచంద్రపురం పట్టణము శ్రీ బిల్డింగ్ ప్రక్కన గల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి గంటా శివ, విల్లా కార్తీక్, జడ్డు సతీష్, బండి సత్య వీరభద్రరావు, తోట రామకృష్ణ, ఆరంకోటి అచ్యుతానంద్, బుంగారాజు, కణితి రాంబాబు, సంపతి సత్యనారాయణ మూర్తి, బోనం శ్రీనివాస్, ముప్పనపల్లి గణేష్, గుబ్బల శ్రీనివాస రావు, కొమ్మిరెడ్డి సురేష్, పల్లా నాగేంద్ర స్వామి, అక్కిరెడ్డి శ్రీనివాసరావు లకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ మరియు రామచంద్రపురం పట్టణ జనసేన నాయకుల ఆద్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించిన వారికి శాలువాలతో, పూల మాలలతో మరియు జనసేన పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందజేసిన కిట్లు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు బుంగరాజు, సంపత్ కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న, గంగవరం మండల అధ్యక్షులు చిర్రారాజ కుమార్, కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు, ఎంపిటిసిలు చిక్కాల స్వామి, సాక్షి శివక్రిష్ణ కుమార్ వెల్ల జనసేన నాయకులు మంచెం ఈశ్వరుడు వెంకటాయపాలెం జనసేన నాయకులు కణితి రాంబాబు, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, నంబుల నాగు, తదితర 150 మంది నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.