గుంతకల్ పట్టణంలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గంలో జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ సూచనల మేరకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, సంయుక్త కార్యదర్శి జీవన్ కుమార్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుంతకల్లు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కురువ పురుషోత్తం అధ్యక్షతన అత్యంత ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసిన 12 మంది వలంటీర్లను అధ్యక్షుల వారి అభినందన పత్రము మరియు పార్టీ జెండాని ఇచ్చి శాలువాతో గౌరవంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు బండి చంద్రకళ, వీరమ్మ గుంతకల్లు పట్టణ జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు బండి శేఖర్, విజయ్ కుమార్ జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, సోహెల్ జనసేన పార్టీ రిసోర్స్ సభ్యుడు పాలగిరి చరణ్, నిస్వార్థ జనసైనికులు, నాయకులు సుబ్బయ్య, గాజుల రఘు, పాండు కుమార్, బోయ వీరేష్, ఆటో రామకృష్ణ, శ్రీనివాసులు, రమేష్ రాజ్, మంజునాథ్, అమర్నాథ్, సూరి, ఆర్ సి సురేష్, మహేష్, దాదు, మౌలా, అనిల్, హరి ప్రసాద్, పవన్ చెర్రీ, కసాపురం నందా, వంశీ, భరత్, భాష, రాజు, వెంకటేష్, మల్లికార్జున, శివకుమార్, అన్వర్ భాష, సత్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.