తొండంగి మండలంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా, తుని నియోజకవర్గం, తొండంగి మండలంలో బెండపూడి గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తొండంగి మండల అధ్యక్షులు సోమిశెట్టి వీర్రాజు నాయుడు, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, బోనం చినబాబు, తొండంగి మండల కమిటీ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.