సహజ వనరులను దోచుకొనే ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవా? : గాదె

పొన్నూరు పట్టణం‌లోని వీవర్స కాలనీలో జనసేనపార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దేశంశెట్టి సూర్య మరియు వీవర్స్ కాలనీ జనసైనికులు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పటు చేయగా ఈ మజ్జిగ కేంద్రకాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం గాదె మాట్లాడుతూ… వేసవి ‌తాపాన్ని తట్టుకోలేక అల్లాడి పోతున్న పేద ప్రజలకోసం మజ్జిగ చలివేంద్రం ఏర్పటు చేశారని తెలిపారు. ప్రతి రోజు 300 లీటర్ల మజ్జిగను ప్రజలకు అందించేందుకు జనసైనికులు సొంత ఖర్చులతో సిద్దమయ్యారని తెలిపారు. అధికారం లేక పోయినా ప్రజా సేవ చేసేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారన్నారు. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యె, మాజీ ఎమ్మెల్యెలు మాత్రం నువ్వు మైనింగ్ లో వందల కోట్లు దోచావంటే నువ్వేమి తక్కువ వేల కోట్లు దోచావని ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రజలు ఆలోచించాలని ప్రజలకు మేలు చేసేది, సేవ చేసేది ఎవరో గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నారదాసు ప్రసాద్, తాళ్లూరు అప్పారావు, మేకల రామయ్య యాదవ్, చట్టాల త్రినాథ్, పొన్నూరు పట్టణ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, పొన్నూరు టౌన్ కమిటీ సభ్యులు ఆకుల గోపి, గడమూరి చందు, వలంశెట్టి శ్రీధర్, నెల్లూరు రాజేష్, హుస్సేన్ & మండల కమిటీ సభ్యులు, పెరవల్లి అరుణ్ ప్రసాద్, తమిర్చి సురేష్, చందు శివ కోటేశ్వరరావు, నున్నా మోహన్, సొంగ సత్యనారాయణ మరియు వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.