ఇంటింటికి జనసేన సిద్దాంతాలు, మేనిఫెస్టో

*పవనన్న ప్రజాబాట 81వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, వలభరావుపేట గ్రామంలో సోమవారం పవనన్న ప్రజాబాట 81వరోజు కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాల్లోకి వెల్లడం జరిగింది. జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు అలుపు ఎరుగని కార్యదీక్షతో ప్రతి గ్రామాల్లో సందర్శించిన వ్యక్తి.. జనసేనపార్టీ జిల్లా నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు. లక్ష్మునాయుడు సొమవారం వల్లభరావుపేట గ్రామంలో ఇంటింటికి వెల్లి జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. గత కోన్ని సంవత్సరాల నుండి కుటుంబ పరిపాలన జరుగుతుంది.రెండు పార్టీల పరిపాలన చూసారు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. జనసేనపార్టీ అదికారంలొకి వచ్చినట్లు అయితే సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వబడును. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వబడును.. రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించబడును. నిరుద్యోగులకు ఏటా లక్ష ఉద్యోగాలు ఇవ్వబడును కనుక ఈసారి జనసేనపార్టీకి మద్దతు కోరాము. ప్రజలు కూడా ఈసారి జనసేనపార్టీని ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలుపించుకోవాలని చెప్పారు.. ఈ కార్యక్రమంలో వల్లభరావుపేట గ్రామ జనసైనులు గుడి. మహేష్, బాబు, గుడి. సురేష్,గుడి.గౌరినాయుడు,బోంతు.వాసు,బోంతు.రంజిత్,గుడి.దుర్గాప్రసాద్,లింగాల.కిరణ్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.