డా. సందీప్ పంచకర్ల ఆద్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్

ఆంధ్రప్రదేశ్ రోడ్లు దుస్థితి ప్రభుత్వంకి తెలిసే విదంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు #GoodMorningCMSir, అనే కార్యక్రమన్ని జనసేన భీమిలి ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల సూచనలు మేరకు.. జనసేన నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో.. 5వార్డు మధురవాడ గణేష్ నగర్ రోడ్డు లో నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా డా. సందీప్ పంచకర్ల మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు గా వున్నా అవంతి గారికి ప్రజలు బాధలు తెలియడం లేదు అని ఇదే నియోజకవర్గం లో రెండు సార్లు శాసన సభ్యులుగా వున్నా మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇప్పుడు ఇక్కడ వున్నా రోడ్లు చూస్తే అర్ధం అవుతుంది అని అన్నారు. జనసేన భీమిలి నియోజకవర్గ నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు ఇదే పరిస్థితి లో ఉంది అని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది అని, ఇదే రోడ్డు లో అనేక పాఠశాలలు ఉండటం వల్ల విద్యార్థులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేసారు. ఇప్పుడుకి ఐయినా అధికారులు ప్రజలు ఇబ్బంధులను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వెంకట సాయి, సాయి వర్మ, దిలీప్, హరీష్, గణేష్, బుల్లెట్ రాజేష్, మను, శ్యామ్, హరీష్ పాల్గొన్నారు.