మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సాయం

విశాఖపట్టణం, దక్షిణ నియోజకవర్గం, స్థానిక 34 వ వార్డు భూపేష్ నగర్ లో మృతి చెందిన కడిఠీ శ్రీను కుటుంబానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా బుధవారం ఆయన పలు వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. ఇతరులకు మంచి చేయాలనే సంకల్పంతో తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సేవలోనే దేవుడు ఉన్నాడని అన్నారు. పార్టీలకతీతంగా తాను ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నరేష్, లక్ష్మణ్, కనకరాజు, రమణ, శివ, గురుమూర్తి, నాయుడు, బద్రి, నాగరాజు, వాసుపల్లి దుర్గ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.